నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చిన నాగబాబు..

నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చిన నాగబాబు..

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బీజేపీకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాంతో పవన్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నేత అంటే ప్రజలకు ఉపయోగపడాలని, పార్టీల మధ్య కప్పగెంతులు వేయకూడదని, రాజకీయనేత అంటే ప్రజల పక్షం వహించాలి కానీ పదవి పక్షం కాదన్న రీతిలో ప్రకాష రాజ్ అన్నారు. దాంతో మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్‌కు ఘాటుగా సమాదానం ఇచ్చారు. పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతీ పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని ఆగ్రం వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతాయి. కానీ వాటి మార్పు వెనక ఉండే ఉద్దేశ్యం ఆ పార్టీకి ప్రజలకు దీర్ఘకాలం పాటు మంచి చేకూర్చేలా ఉండాలి. మా నాయకుడు పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలకు అనేక ప్రయేజనాలు, పార్టీకి మేలు రెండు సాధ్యమవుతాయి. అందుకనే పవన్ ఇంతటి కృషి చేశాడు. పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతీ పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. అయితే ప్రకాష్.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం డిబేట్‌లో నీ రాజకీయ డొల్లతనం అర్థమయింది. సుబ్రహ్మణ్యం ప్రశ్నలకు సమాదానం చెప్పలేక పడుతున్న నీ తడబాటు నాకు ఇంకా గుర్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకున్న నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే వారు ప్రజలకు ఉపయోగే పని చేసినప్పుడు హర్షించ గలగాలి. విమర్శించడం తప్ప మంచిని గుర్తించలేని నీకు సంస్కారం ఎలా నేర్పించగలుగుతాం. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేశానికి బీజేపీ, ఆంధ్రాకి జనసేన వంటి పార్టీలు ఉంటేనే అవి అభివృద్దిని చూడగలగుతాయి.

నీ లాంటి అతితెలివి పరులు ఎన్ని మాట్లాడినా బీజేపీ, జనసేనా కూటమి శక్తిని అడ్డుకోలేరు. నువ్వు నీ పని సక్రమంగా నిర్వర్తించిన తరువాత పక్కవారి పనిలో వేలు పెట్టు. నువ్వు ఎంతమంది నిర్మాతల్ని డబ్బకొసం హింసించింది. ఇచ్చిన డేట్స్‌ని కాన్సల్ చేసింది అన్నీ తెలుసు. ముందు నువ్వు మారు. రాష్ట్ర మార్పు గురించి తరువాత మాట్లాడు. ఆ తరువాత మంచి మనిషి, నిశ్వార్తపరుడైన నాయకుడు పవన్‌ను విమర్శించు. డైరెక్టర్లని కాకా పట్టి, నిర్మాతలని కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా చెప్పలేను. బీజేపీని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు విమర్శించినా నిన్ను ఎవ్వరూ ఏమీ అనదేంటే అది బీజేపీ నాయకత్వానికి ప్రజలు ఇస్తున్న గౌరవం. ఈ ఎన్నకల్లో బీజేపీ, జనసేన తమ సత్తాను చాటుతాయి. ఎవరో అడిగారని నీ పనికిమాలిన తెలివి చూపక’ని నాగబాబు సుటైరికల్‌గా అన్నారు. అయితే ప్రస్తుతం నాగబాబు అన్న మాన ఒకటి నిజం అన్నట్లుగానే ఉందని, ప్రతి పనికిమాలిన వాడు పవన్‌ను విమర్శిస్తున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఒక్కరు పవన్‌ను విమర్శించి ఏదో సాధించనట్లుగా విర్రవీగుతుంటారని పవన్ అభిమానులు అంటున్నారు.