సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!

సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!

టాలీవుడ్‌ సింగర్‌ సునీత,‌ ప్రముఖ డిజిటల్ బిజినెస్‌మెన్ రామ్‌ వీరపనేనితో ఇటీవల వివాహం  చేసుకున్న విషయం తెలిసిందే... వీళ్లిద్దరి వివాహం గత శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమం కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అట్టహాసంగానే జరిగింది. రెండో పెళ్లి చేసుకున్న సునీతకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్‌ నాగబాబు తన ట్విట్టర్‌ వేదికగా సింగర్‌ సునీత మ్యారేజ్‌పై తనదైన స్టైల్‌లో స్పందించారు. "సంతోషం అనేది పుట్టుకతో రాదు. దాన్ని మనం అన్వేషించి అందుకోవాలి. తమ సంతోషాలను కనుగొన్నందుకు రామ్‌, సునీతకు కంగ్రాట్స్‌. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి మీ జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, సంతోషం అనేది ఎప్పటికీ మీ శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌" అని నాగబాబు ట్వీట్‌ చేశారు.