మెడికల్ పీజీ ప్రవేశాల గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశం.!

మెడికల్ పీజీ ప్రవేశాల గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశం.!

మెడికల్ పీజీ ప్రవేశాల గడువు ఆగస్టు 31 వరకు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ పై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. కాగా కోర్టు ప్రైవేటు వైద్య కళాశాలల వాదనతో  ఏకీభవించింది. అడ్మిషన్ల గడువు పెంచుతూ ఆదేశాలను జారీచేసింది.