గవాస్కర్ కు మళ్ళీ ఆ రెండు సీట్లు... 

గవాస్కర్ కు మళ్ళీ ఆ రెండు సీట్లు... 

భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ గురించి అందరికి తెలుసు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడు ఆయనే. అందుకే అటువంటి ఆటగాడికి వాంఖడే స్టేడియం లో రెండు శాశ్వాత సీట్లు కేటాయించారు అధికారులు. అయితే  గవాస్కర్ తన టెస్ట్  క్రికెట్ కు  ఏ పెవిలియన్ నుండి అయితే  వీడ్కోలు పలికాడో అందులోనే రెండు సీట్లు... గవాస్కర్ కు ఒకటి, ఆయన సతీమణికి మరొకటి కేటాయించారు. కానీ 2011 ముందు ఆ స్టేడియంలో జరిగిన కొన్ని మరమ్మతుల తర్వాత ఆ రెండు  సీట్లు మాయం అయ్యాయి. అయితే ఆ రెండు సీట్లను మళ్ళీ ఇప్పుడు తిరిగి వారికి కేటాయించాలని ముంబయి క్రికెట్ సంఘం నిర్ణయించింది.