ట్రంప్ నయా ఛాలెంజ్: అమెరికా వదిలి వెళ్ళిపోతా...!!

ట్రంప్ నయా ఛాలెంజ్: అమెరికా వదిలి వెళ్ళిపోతా...!!

అమెరికా  అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం ఊపందుకుంది.  వాడి వేడిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  కరోనా నుంచి కోలుకొని ప్రచారం ప్రారంభించిన తరువాత ట్రంప్  జోరుగా ప్రచారం చేస్తున్నారు.  ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం తనదే అని ధీమా వ్యక్తం చేశారు.  

అమెరికా ప్రజలు మరో నాలుగేళ్లు రిపబ్లికన్ పార్టీ పరిపాలించాలని కోరుకుంటున్నారని అన్నారు.  తన ఓటమిని ఊహించుకోవడం లేదని అన్నారు.  ఒకవేళ తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధిస్తే, తాను గతంలో మాదిరిగా ఉండలేనని, అమెరికా వదిలి వెళ్ళిపోతానేమో చెప్పలేనని అన్నారు.  ఈ ఏడాది జరిగే ఎన్నికలు చాలా కీలకమైనవని, అమెరికా ప్రజలకు అధికారులు ఇచ్చే దిశగా ఇప్పటి వరకు పాలన సాగిందని మరోమారు ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ గెలిస్తే మున్ముందు దేశానికి ప్రజలకు మరింత సమర్ధవంతగా పాలన అనిస్తామని ట్రంప్ తెలిపారు.