'నిరుద్యోగ భృతి కాదు.. ఉపాధి కల్పిస్తాం'

'నిరుద్యోగ భృతి కాదు.. ఉపాధి కల్పిస్తాం'

కాంగ్రెస్‌, బీజేపీలు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని.. ప్రతిదీ ప్రైవేటు రంగంలోకి మారుస్తూ అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్‌ మాయావతి అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇవాళ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోందని.. ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేదని, అన్ని వర్గాలకూ టికెట్ల కేటాయింపులో సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే యూపీ తరహాలో ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సార్లు అధికారంలోకి వచ్చామని.. అక్కడ నిరుద్యోగ భృతి అని కాకుండా యువతకు అన్ని రంగాల్లోనూ ఉపాధి కల్పించామని చెప్పారు. ఒపీనియన్ పోల్స్, హామీలను నమ్మొద్దని.. తాము తప్పా అన్ని పార్టీలూ బూటకపు మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు.