టెస్టులో మొదటి వికెట్ సాధించిన నటరాజన్...

టెస్టులో మొదటి వికెట్ సాధించిన నటరాజన్...

భారత్-ఆసీస్  మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత పేసర్ నటరాజన్ తన అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో నటరాజన్ తన మొదటి టెస్ట్ వికెట్ సాధించాడు. 100 పైగా భాగసౌమ్యంతో దూసుకుపోతున్న లాబుస్చాగ్నే, మాథ్యూ వేడ్ జంటను విడదీసాడు. నటరాజన్ బౌలింగ్ లో వేడ్ 45 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. దాంతో 200/4 తో నిలిచింది ఆసీస్. ఇక సెంచరీ పూర్తి చేసుకున్న లాబుస్చాగ్నేకు తోడుగా కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే ఈ మొదటి రోజు ముగియడానికి ఇంకా 25 ఓవర్ల ఆట మిగిలి ఉంది.