ట్రెండ్ అవుతున్న మాస్టర్.. 

ట్రెండ్ అవుతున్న మాస్టర్.. 

విజయ్ దళపతి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా మాస్టర్. ఈ సినిమా కోసం అభిమానులు దాదాపు 15నెలలుగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా టీజర్, ప్రచార చిత్రాలకు లభించిన ఆదరణ మామూలుగా లేదు. ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో సైకాలజీ ప్రొఫెసర్‌గా విజయ్ కనిపించాడు. తమ అభిమాన హీరో విజయ్ కొత్త తరహీ కథతో రానుండటంతో అభిమానులు సినిమాపై తారాస్థాయి అంచనాలను పెట్టుకున్నాడు. కానీ  ఈసినిమా వారి అంచనాలను అందుకోలేక పోయింది. టీజర్‌తో రికార్డులు సృష్టించిన సినిమా థియేటర్ల విషయానికొస్తే చతికిల పడింది. ప్రస్తుతం ఈ సినిమా ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. మాస్టర్ డిసాస్టర్ అంటూ అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై తాము పెట్టుకున్న అంచనాలన్నీ చల్లాచెదురయ్యాయని ప్రేక్షకులు అసహనం చూపారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా ఉందని కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా నత్తనడకన సాగిందని అంటున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ ఓవరాల్ సినిమాత్రం అంతలేదని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలపుతున్నారు. అయితే భారీస్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా చతికిల పడింది. మరి ఈ సినిమా వసూళ్ల పరంగా ఏ మాత్రం రాణిస్తుందో వేచి చూడాలి.