హైదరాబాద్ లో అర్థరాత్రుళ్ళు ప్రమాదకరంగా మారిన లారీలు

హైదరాబాద్ లో అర్థరాత్రుళ్ళు ప్రమాదకరంగా మారిన లారీలు

 

హైదరాబాద్ లో అర్థరాత్రుళ్ళు లారీలు ప్రమాదకరంగా మారాయి. మితి మీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లతో వాహనదారుల ప్రాణాలు తీస్తున్నారు లారీ డ్రైవర్లు. ఒక్క రోజే ఇద్దరు వాహనదారులు ప్రాణాలు తీశాయి లారీలు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ వీలర్ పై వెళ్తున్న మెడికో విద్యార్థిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మెడికో చనిపోయింది. కడప జిల్లా బుద్వెల్‌కు చెందిన ఆదిరేష్మా మెడికల్ స్టూడెంట్. హైదరాబాద్ లో తన‌ స్నేహితురాలి దగ్గరికి యువతి వచ్చినట్టు చెబుతున్నారు. మరో ఘటన కంఛన్‌భాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టూ వీలర్ పై వెళ్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రశాంత్ ను లారీ ఢీ కొట్టగా ఘటనా స్థలంలోనే చనిపోయాడు ప్రశాంత్‌. 

కాశీకి వెళ్లేందుకు వచ్చి పై లోకాలకు : 

మొదటి ఘటనకు సంబంధించి కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లారీ డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని ప్రమాదంలో చనిపోయిన యువతికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని అన్నారు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదని ఆయన అన్నారు. మెడికో కు టూవీలర్ ఇచ్చిన వారి పైన కేసు నమోదు చేస్తామని ఆయన అన్నారు. ఆమె ఈ నెల 18న హైదరాబాద్ కు వచ్చిందన్న ఆయన గుల్బర్గా లో డెంటల్ మెడిసిన్ చదువుతోందని అన్నారు. వీరు ఇద్దరూ ఈ నెలలో కాశి యాత్రకు వెళ్ళనున్నారని ఇందు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.