బ్లాక్ పాంతర్2‌కు మార్వెల్ సిద్దం

బ్లాక్ పాంతర్2‌కు మార్వెల్ సిద్దం

వాషింగ్‌టన్: బ్లాక్ పాంతర్‌ ఈ పాత్రకు మార్వెల్‌లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా ఎవ్వరికీ తగ్గకుండా భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే బ్లాక్ పాంతర్ 2 సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇంతలో కరోనా వచ్చి సినిమాను షూటింగ్‌కు కూడా రాకుండా నిలిపివేసింది. ఆ తరువాత బ్లాక్ పాంతర్ కథానాయకుడు చడ్‌విక్ బోస్‌మన్ మరణవార్త అభిమానుల మనసులను కలచివేసింది. అతడు క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించిన విషయం తెలిసి తల్లడిల్లి పోయారు. దాంతో ఇక బ్లాక్ పాంతర్2 రాదని అందరూ అనుకున్నారు. అయితే మార్వెల్ బ్లాక్ పాంతర్2 సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం ర్యాన్ కూగ్లర్, మార్వెల్‌ అధికారులు ప్రారంభం ఎప్పుడు చేయాలని నిర్ణయించారు. తొలుతగా 2021 మార్చిలో ప్రారంభించాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే మార్వెల్ ఒక్క సినిమాను విడుదల చేయని సంవత్సరంగా 2020 నిలిచింది. అయితే ఇప్పుడు బ్లాక్ పాంతర్ సినిమా షూటింగ్‌ను 2021 జులైలో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్ జులైలో మొదటగా అట్లాంటాలో మొదలు కానుందని, ఆరు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. కానీ మెయిన్ రోల్ ఎవరు చేయనున్నది మార్వెల్ చెప్పలేదు. ఈ రేసులో మెక్సికన్ హీరో టెనోచ్ హుర్ట కూడా ఉన్నాడు. మరి ఈ చిత్రంలో బ్లాక్ పాంతర్ చడ్‌విక్ అభిమానులను అలరించగలుగుతాడా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకూ ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందో చూడాలి.