మార్కెట్ లోకి మారుతీ బలెనో 

మార్కెట్ లోకి మారుతీ బలెనో 

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజికి ఇండియా మరో కొత్త మోడల్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్తగా విడుదల చేసిన ఈ అప్ డేటెట్ వెర్షన్ "బలెనో" కారు ధర రూ. 5.4 లక్షల నుంచి రూ.8.77లక్షలుగా నిర్ణయించారు. ఈ మోడల్ లో స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కారు బీటింగ్ లో కూడా చాలా మార్పులు చేశామని మారుతీ సుజికి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు.  మారుతి ఇటీవల మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది.  38 నెలల్లో 5 లక్షల సెల్స్  లక్ష్యాన్ని పూర్తి చేసింది. బలెనో మోడల్ లో డీజిల్, పెట్రోల్ రెండూ లభ్యమవుతున్నాయి. పెట్రోల్ మోడల్ ధర రూ.5.4 లక్షలు కాగా... డీజిల్ మోడల్ ధర రూ.7.45 గా నిర్ణయించారు.