మిస్డ్ కాల్ ప్రేమ..ఇద్దరు పిల్లలను వదిలేసి..!

మిస్డ్ కాల్ ప్రేమ..ఇద్దరు పిల్లలను వదిలేసి..!

ఓ వివాహిత మిస్డ్ కాల్ తో ప్రేమలో పడి తన ఇద్దరు పిల్లలను సైతం విడిచి వెళ్ళిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవిలోచోటు చేసుకుంది. చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన ఆ మహిళ చిన్నవయస్సు నుండి బంధువులు వద్ద పెరిగింది. ఆమెకు పెళ్లి వయస్సు వచ్చాక మహాదేవికి చెందిన ఒక కూలీ కార్మికుడు మానవత్వంతో కట్నం, బంగారం తీసుకోకుండానే పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. అప్పటివరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. ఈ క్రమంలో ఆ మహిళకు మిస్డ్ కాల్ లో కాయత్తార్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో మహిళ యువకుడిని పెళ్లి చేసుకోలేవాలని నిశ్చయించుకుంది. దానికోసం ఆమె తనకు వివాహం జరగలేదని ఆ యువకుడిని నమ్మించింది. అనంతరం గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. వెళ్లిన తరవాత ప్రియుడినీవివాహం చేసుకుని ఇంటికి తిరిగిరాలేదు. దాంతో ఆమె భర్త తన భార్య కనిపించట్లేదని సేరన్‌ మహాదేవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా పెళ్లితరవాత ఆమె తన పెళ్లి ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను, పెళ్లి చేసుకున్న యువకుడిని పిలిపించి విచారించారు. మహిళకు పెళ్ళైన సంగతి భయటపడటం తో యువకుడు ఆమెను తీసుకువెళ్లందుకు నిరాకరించాడు. అంతేకాకుండా ఆమె భర్త, బంధువులు సైతం ఆమెను కుటుంబంలోకి అనుమతించమని తేల్చిచెప్పారు. దాంతో ఆమెకు ఓ శిబిరంలో పోలీసులు పునరావాసం కల్పించారు.