రెండో సెషన్ లో ఆసీస్ దే ఆధిపత్యం...

రెండో సెషన్ లో ఆసీస్ దే ఆధిపత్యం...

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విషయం తెలిసిందే. ఈ చివరి టెస్ట్ మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. అయితే ఈ సెషన్ లో ఆసీస్ దే ఆధిపత్యం అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సెషన్ పూర్తయే సమయానికి 65/2 తో నిలిచిన ఆసీస్ రెండో సెషన్ పూర్తయే సమయానికి 154/3 తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. లాబుస్చాగ్నే(73) అర్ధశతకంతో కొనసాగుతుండగా మాథ్యూ వేడ్(27) తో అతనికి సపోర్ట్ గా నిలిచాడు. ఇక ఈజోడి ఇప్పటికే 67 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పింది. అయితే ఈ సెషన్ భారత బౌలర్లు కేవలం ఒక్క స్మిత్ వికెట్ మాత్రమే తీయగలిగారు. అలాగే పేసర్ నవదీప్ సైని గాయం కారణంగా  తప్పుకున్నాడు. ఇక ఈరోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.