100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో జూక‌ర్ బ‌ర్గ్‌.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు..

100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో జూక‌ర్ బ‌ర్గ్‌.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు..

ఫేస్‌బుక్‌తో స‌త్తా చాటిన మార్క్ జూక‌ర్ బ‌ర్గ్ ఇప్పుడు 100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరిపోయాడు.. ఈ క్ల‌బ్‌లో చేరిన అతిపిన్న వ‌య‌స్కుడిగా రికార్డు సృష్టించాడు జూక‌ర్ బ‌ర్గ్.. టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్‌ను ఫేస్‌బుక్ లాంచ్ చేయ‌డం.. అది సూపర్ సక్సెస్ అవ్వడంతో.. ఫేస్‌బుక్ అధినేతకు లాభాల‌పంట ప‌డింది.. దీంతో.. ఆయ‌న ఆస్తి 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇక‌, ఇప్పటి వరకు ప్రపంచంలో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ మాత్రమే ఈ మార్కును దాట‌గా.. ఇప్పుడు మార్క్ జూకర్ బర్గ్ కూడా ఈ క్లబ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు ఆన్‌లైన్ లో ఎక్కువగా గ‌డ‌ప‌డంతో.. జూకర్ బర్గ్ ఈ సంవత్సరం తన ఆస్తిని 22 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు. అయితే, ఇదే సమయంలో జెఫ్ బెజోస్ తన ఆస్తిని ఏకంగా 75 బిలియన్లు పెంచుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.