నెటిజన్ పై ఫైర్ అయిన క్రికెటర్ భార్య.!

 నెటిజన్ పై ఫైర్ అయిన క్రికెటర్ భార్య.!

టీం ఇండియా క్రికెటర్ మనోజ్ తివారి భార్య ఓ క్రికెటర్ పై ఫైర్ అయ్యింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ తివారి తన కెరీర్ లో 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఆ తర్వాత ఫామ్ కోపోవడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం 2018 వరకు ఆడాడు. కానీ 2019లో మనోజ్ తివారిని వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఎంపిక చేసుకోలేదు. దాంతో గత ఏడాది ఏ ఫ్రాంఛైజీ మనోజ్ తివారీని కొనుగోలు చేయలేదు. దాంతో క్రికెట్ కు దూరమయ్యాడు. ఇక ఈ విషయమై ఓ నెటిజన్ టీమిండియా తరపున ఆడిన 11 మంది ప్లాప్ క్రికెటర్స్‌ అంటూ ఓ జాబితాను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అందులో మనోజ్ పేరు కూడా ఉంది. దాంతో అది చుసిన మనోజ్ భార్య  ‘నా భర్తని ఆ జాబితాలో చేర్చడానికి నీకెంత ధైర్యం..? నువ్వు ఫస్ట్ అతని గణాంకాల్ని పరిశీలించు. అంతేతప్ప ఇతరులపై ఇలా బరద చల్లొద్దు’ అంటూ పోస్ట్ చేసింది.