తెలుగు అందాలతో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'

తెలుగు అందాలతో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'

మణిరత్నం అప్ కమింగ్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. తమిళనాడుకి చెందిన చోళ రాజుల కాలం నాటి కథ. అయితే, ట్విస్ట్ ఏంటంటే... లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం... చాలా వరకూ తన రాయల్ తమిళ్ ఎపిక్ ని... తెలుగు నేలపైనే చీత్రకరిస్తున్నాడు. మూవీలో మన గోదారి అందాలు కూడా కనువిందు చేయబోతున్నాయి! 

2018లో విడుదలైన ‘నవాబ్‘ సినిమా తరువాత మణిరత్నం డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘పొన్నియన్ సెల్వన్‘. చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎన్నో రోజులుగా వార్తల్లో ఉంది. అయితే, అన్ని అవాంతరాలు దాటుకుని సెట్స్ మీదకి వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ లాక్ డౌన్ తరువాత శరవేగంగా చీత్రకరణ జరుపుకుంటోంది. దాదాపుగా షూటింగ్ పార్తైన ఈ మల్టీ స్టారర్ లో గతంలో మణిరత్నం డైరెక్షన్ లో నటించిన చాలా మంది సినీ తారలు కనిపించబోతున్నారు... విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిశ, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ... వీరే కాక ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ‘పొన్నియన్ సెల్వన్’లో కనిపించబోతున్నారు. 

అయితే, ఈ అప్ కమింగ్ మణిరత్నం మల్టీ స్టారర్ షూటింగ్ మాత్రం చాలా రోజులుగా మన హైద్రాబాద్ లోనే జరుగుతోంది. చాలా సన్నివేశాలు ఫిల్మ్ సిటీలో చీత్రకరించారు. ఇక మరికొన్ని కీలక సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సింగమపల్లి ప్రాంతానికి బయలుదేరారట. గోదావరి నదిపై మణిరత్నం ఇంపార్టెంట్ సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నాడట. సింగమపల్లి, పాపికొండల నడుమ అందమైన గోదావరి నేపథ్యంలో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాలో కీలకంగా అలరిస్తాయంటున్నారు. చూడాలి మరి, తెలుగు అందాలతో మణిరత్నం తీస్తోన్న తమిళ చారిత్రక చిత్రం ఎలా ఉండబోతోందో!