డిసెంబర్ లోనే మందిర్ షురూ

డిసెంబర్ లోనే మందిర్ షురూ

అయోధ్యలోని రామాలయ నిర్మాణాన్ని డిసెంబర్లోనే మొదలు పెడతామని వి.హెచ్.పి. నాయకుడు రాంవిలాస్ వేదాంతి అన్నారు. అయోధ్యలో రామాలయం, లక్నోలో అల్లా అనే పేరుతో మసీదు నిర్మిస్తామన్నారు. వివాదాస్పద స్థలంలో మందిర నిర్మాణం అనేది చట్టం ద్వారానో, ప్రజాప్రతినిధుల ద్వారానో పూర్తయితే అహింస పెచ్చరిల్లుతుందని.. అందువల్ల ఈ కార్యక్రమం ఏకాభిప్రాయంతోనే సాధిస్తామన్నారు. 

ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రామాలయం నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారని, కానీ.. వారి ఎంట్రీ హింసకు దారి తీస్తుందన్నారు. తాము శాంతినే కోరుకుంటున్నందు వల్ల ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలోనే జరిపిస్తామన్నారు. 

జాతీయస్థాయిలో పాల్గొన్న సాధుసంతుల ధర్మాదేశ్ సదస్సులో వి.హెచ్.పి. నాయకుడు ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే ఆర్ఎస్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ తేవాలని కోరిన మరుసటి రోజే వి.హెచ్.పి. నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.