శ్రీవారి సన్నిధిలో మంచు అక్కాతమ్ముడు

శ్రీవారి సన్నిధిలో మంచు అక్కాతమ్ముడు

సినీ నటి మంచు లక్ష్మి ఈ రోజు ఉదయం తన సోదరుడు మంచు విష్ణుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొన్న వీరిద్దరు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అలాగే, ఆలయ అధికారులు వారిద్దరికి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం విష్ణుతో లక్ష్మి ఫొటో తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు పొందమని మంచు లక్ష్మి చెప్పారు.