క‌ట్టుకున్న‌వాడే కాదంటున్నాడు.. క‌రోనా భ‌య‌మేన‌ట‌..!

క‌ట్టుకున్న‌వాడే కాదంటున్నాడు.. క‌రోనా భ‌య‌మేన‌ట‌..!

క‌రోనా రావ‌డం ఏమో గానీ.. క‌రోనా భ‌య‌మే కుటుంబ‌స‌భ్యుల‌ను సైతం దూరం పెట్టేలా చేస్తోంది.. చివ‌ర‌కు క‌ట్టుకున్న‌వాడే... క‌రోనా నెగిటివ్ వ‌స్తేనే ఇంట్లోకి అడుగుపెట్టు అన‌డంతో.. ఓ మ‌హిళకు దిక్కుతోచ‌ని స్థితి ఏర్ప‌డిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో జ‌రిగింది.. వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగ‌ళూరుకు చెందిన మ‌హిళ‌.. 3 నెల‌ల క్రితం చండీఘ‌ర్ వెళ్లింది.. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో.. వ‌చ్చేదారిలేక‌.. ఆమె అక్క‌డే చిక్కుకుపోయింది. స‌ద‌రు మ‌హిళ భ‌ర్త‌, కుమారుడు మాత్రం బెంగ‌ళూరులోనే ఉన్నారు.. అయితే, లాక్‌డౌన్ స‌డ‌లింపులు వ‌చ్చిన త‌ర్వాత ఈ మ‌ధ్య తిరిగి ఇంటికి చేరుకుంది ఆ మ‌హి‌ళ‌.. అక్క‌డే ఆమెకు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

3 నెల‌ల త‌ర్వాత ఇంటికి వ‌చ్చి భార్య‌ను క‌రోనా భ‌యంతో.. ఇంట్లోకి రానివ్వ‌లేదు భ‌ర్త‌.. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని.. క‌రోనా నెగ‌టివ్‌గా తేలిన త‌ర్వాతే ఇంట్లో అడుగుపెట్టాల‌ని తెగేసి చెప్పేశాడు.. ఇక‌, దిక్కుతోచ‌ని స్థితిలో.. బాధితురాలు మ‌హిళ‌ల స‌హాయ కేంద్రాన్ని సంప్ర‌దించింది.. అయితే.. వారితో క‌లిసి.. ఆమె ఇంటికి వెళ్లేస‌రికి.. కూమారుడితో క‌లిసి భ‌ర్త ఎక్క‌డికో వెళ్లిపోయాడు.. దీంతో.. వ్య‌వ‌హారం పోలీసుల‌ వ‌ర‌కు వెళ్లింది.. భ‌ర్త‌ను పీఎస్‌కు పిలిపించిన పోలీసులు.. ఇద్ద‌రికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. క‌రోనా వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.. ఆ త‌ర్వాత త‌న భార్య‌ను తీసుకుని ఇంటికి వెళ్లాడు భ‌ర్త‌.. ప్ర‌స్తుతం ఆ మ‌హిళ హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.