ప్రేమకు శిక్ష? కూతురిపై తండ్రి అఘాయిత్యం.. తల్లి సహకారం..!

ప్రేమకు శిక్ష? కూతురిపై తండ్రి అఘాయిత్యం.. తల్లి సహకారం..!

ఆయనో ఉన్నతమైన పదవి ఎలగబెట్టారు.. పదవి మాట ఎలా ఉన్నా కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. కూతురు పట్ల భర్త తీరును ప్రశ్నించి.. ఆ కనుపాపను కాపాడాల్సిన తల్లి కూడా భర్తకే వత్తాసు పాడడం మరో దారుణం... ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మోరెనా జిల్లాలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వ్యక్తికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.. వీరిలో చిన్నకూతురు 18 ఏళ్లు.. అయితే, ఆ అమ్మాయి స్థానికంగా ఓ యువకుడితో ప్రేమలో పడిందట.. కూతురికి బుద్ధిచెప్పాల్సిన తల్లిదండ్రులు.. కన్న కూతురిపట్ల నీచంగా ప్రవర్తించారు. 

ఈ విషయం పోలీసు స్టేషన్‌కు చేరడంతో.. విచారణలో దారుణమైన విషయాలు వెలుగుచూశాయి.. మార్చి 26న తొలిసారి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి.. బాధితురాలు వంట చేస్తుండగా.. బెడ్‌రూంలోకి లాక్కెళ్లి తాళ్లతో కట్టేసి.. అఘాయిత్యానికి వడిగట్టాడు.. ఓవైపు ఆ యువతి అరుస్తుంటే.. ఆ అరుపులు వినిపించకుండా తల్లి... కూతురి నోట్లో కుక్కడం ఇంకా దారుణమైన విషయం.. ప్రేమ వ్యవహారం ఎందుకు ? అని మందలిస్తూనే.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడట.. పెళ్లికి ముందే ఇలా జరిగితే.. రేపు నీకు పెళ్లైన తర్వాత ఆ విషయంలో పెద్దగా కష్టంగా ఉండదని చెప్పాడట.. రక్షించేవాడ బక్షించడంతో.. షాక్ తిన్న ఆ బాధితురాలు కుమిలికుమిలి ఏడ్చేసింది ఊరుకోగా.. ఏప్రిల్ 10న ఆ యువతి... ఇంట్లో సూటిపోటి మాటలు, వేధింపులు భరించలేక.. దగ్గరల్లో ఉన్న ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లి తలదాచుకోగా.. ఆ విషయం తెలుసుకున్న తండ్రి.. కూతుర్ని లాక్కొచ్చి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఇక తనపై జరుగుతోన్న దారుణాన్ని బాధితురాలు పెద్దక్కకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది.. ఆగ్రహంతో ఊగిపోయిన అక్క.. పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రులను గట్టిగా మందలించి చెల్లిని తనతో తీసుకెళ్లిపోయింది.. అంతే కాదు.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణను కొనసాగిస్తున్నారు పోలీసులు.