రెండ్రోజుల్లో పెళ్లి... వధువు ఫోన్ స్విచ్ ఆఫ్... ఇదే కారణం... 

రెండ్రోజుల్లో పెళ్లి... వధువు ఫోన్ స్విచ్ ఆఫ్... ఇదే కారణం... 

పెళ్లిపేరుతో జరిగే మోసాలను ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం.  సోషల్ మీడియాలో పరిచయాలు మంచివి కాదని, అటువంటి పరిచయాలు ఆర్ధిక ఇబ్బందులకు గురి చేస్తాయని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.  ఇలాంటి ఘరానా మోసం ఒకటి ఇటీవలే బయటపడింది.  హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి సోషల్ మీడియాలో వర్ణన మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  పెళ్ళికి సిద్దమవ్వగానే ఆ యువతి తన అసలు రంగు బయటపెట్టింది  యువకుడి వద్ద నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టింది.  అనేక కారణాలు చూపించి దాదాపుగా 14 లక్షల వరకు వసూలు చేసింది.  పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి యువకుడు అడిగిన డబ్బులు పంపించాడు.  అయితే,  పెళ్ళికి రెండు రోజుల సమయం ఉందనగా, యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.  దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు.  మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.