ప్రేయసి గురక ఆపేందుకు ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు... 

ప్రేయసి గురక ఆపేందుకు ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు... 

నిద్రలో ఎవరైనా గురక పెడుతుంటే వారి పక్కన పడుకునే వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  పక్కనుండే వ్యక్తులు నిద్రపోలేరు.  పదేపదే నిద్రపోతున్న వారిని లేపడం కష్టం అవుతుంది.  కావాలని ఎవరూ గురకపెట్టరు.  అది అలా వస్తుంది అంతే.  దానికి ఎవరూ అడ్డుచెప్పలేరు.  ఇలానే 22 ఏళ్ల జాసన్ గ్రాహం అనే వ్యక్తి తన ప్రేయసి షార్ని బ్రైట్ తో కలిసి జీవిస్తున్నాడు.  ఏడు నెలలుగా కలిసి సహజీవనం చేస్తున్నారు.  అయితే ప్రేయసి నిద్రపోయే సమయంలో గురకపెడుతున్నది.  దీంతో పాపం జాసన్ రాత్రుళ్ళు నిద్రలేకుండా గడిపేవాడు.  షార్ని గురకను ఆపేందుకు రకరకాల ప్రయోగాలు చేశాడు.  చివరకు ఓ ప్రయోగం సక్సెస్ అయ్యింది.  షార్ని గురకపెట్టే సమయంలో ప్రియుడు జాసన్ ఆమె ముఖాన్ని నాకేవాడు.  దీంతో ఆమె గురకపెట్టడం ఆపేసింది.  ఆ విధంగా రోజు చేస్తుండటంతో ఆమె గురకపెట్టడం క్రమంగా తగ్గిపోయిందని ఇప్పుడు రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నానని అంటున్నాడు జాసన్.