భార్యను చంపిన భర్త...చూసిందని కూతుర్ని కూడా !

భార్యను చంపిన భర్త...చూసిందని కూతుర్ని కూడా !

ఒకపక్క అప్పులు మరో పక్క లాక్ డౌన్, పైగా భార్యతో గొడవ పడ్డాడు అదీ కాక మద్యం మత్తులో ఉన్నాడు. ఇంకేం ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
అతను అలా గొంతు నులిమి చంపడం కూతురు చూసింది, హత్యను చూసిందని కూతురిని కూడా గొంతు నులిమీ చంపేశాడా కసాయి తండ్రి. వరంగల్ నగరం ఉర్సుగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలలోకి వెళ్తే బీఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు ప్రయివేటు ఉద్యోగి, పదేళ్ల కిందట అతనికి రమ్య(29)తో పెళ్లయింది. ప్రయివేటు ఉద్యోగంతో ఆదాయం తక్కువ వస్తుండడంతో వ్యాపారం మొదలు పెట్టాడు.

ఆ వ్యాపారం కలిసిరాక నష్టాలొచ్చి ఆర్థికంగా చితికి పోయాడు. ఫలితంగా తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవకు దిగేవాడు. భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాను మారతానంటూ నమ్మించి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయినా మారకుండా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ దిగాడు. ఈ క్రమంలోనే భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. తల్లిని చంపడాన్ని చూసిందని అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల కూతురు మనస్విని(8) ప్రాణం సైతం తీశాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.