భార్యతోనే ఫ్రెండ్ లా అశ్లీల చాటింగ్, వీడియోలతో కోటి నొక్కేసిన భర్త !

భార్యతోనే ఫ్రెండ్ లా అశ్లీల చాటింగ్, వీడియోలతో కోటి నొక్కేసిన భర్త !


గచ్చిబౌలిలో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. భార్యతో భర్త స్నేహితుడి పేరుతో ఛాట్ చేసిన భర్త భార్య దగ్గర్నుంచే కోటి రూపాయలు కొట్టేసినట్టు వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలికి చెందిన ఒక మహిళకి కరీంనగర్‌ లో ఉంటున్న సంతోష్ కుమార్‌కి మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకే కులం కావడంతో ఈ పరిచయం కాస్తా పెళ్లి దాకా వెళ్లింది. పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అతను పెళ్లి నిమిత్తం కట్నకానుకలు కూడా అందుకున్నాడు. వివాహం జరిగాక ఆమె ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లింది. ఇక్కడే ఉన్న భర్త సంతోష్ కుమార్ తన అవసరాల నిమిత్తం ఏవేవో చెబుతూ రూ.63 లక్షలు భార్య నుంచి తీసుకున్నాడు.

అవి కాక తన స్నేహితుడి పేరు అయిన సత్యహర్ష రెడ్డి అనే పేరుతో సదరు భార్య మొబైల్, మెయిల్‌కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపేవాడు. మిత్రుడు పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమె తన భర్త పైన అనుమానం వచ్చి గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది. భర్త సంతోష్ కుమారే, సత్యహర్ష రెడ్డి అనే పేరుతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపినట్టు తేలింది. దీంతో పోలీసులు గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంతోష్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.