భార్య కాపురానికి రాలేదని తాడి చెట్టెక్కిన భర్త

భార్య కాపురానికి రాలేదని తాడి చెట్టెక్కిన భర్త

భార్య కాపురానికి రాలేదని మూడు గంటల పాటు తాడిచెట్టు పై హంగామా చేశాడు భర్త. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోనెపెల్లి కిషన్ అనే వ్యక్తి ఉదయం తాటి చెట్టు ఎక్కి ఇక దిగలేదు. మూడు గంటల పాటు చెట్టు మీదనే ఉన్న అతనిని స్థానిక ప్రజలు చూసి కిందకి రమ్మనా స్పందించలేదు. ఉదయం తాటి చెట్టు ఎక్కిన కిషన్ మధ్యాహ్నం 2 గంటలైనా దిగకపోవడంతో ఊరంతా ఈ విషయం పాకిపోయి ఊరంతా అక్కడికి చేరి ఏమైందని ఎన్నిసార్లు అడిగినా అతను విషయం చెప్పకుండా ఈ తాడి చెట్టు పై నుండి దూకి చనిపోతానని బెదిరించడంతో, వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కిందికి రమ్మని, దిగమని ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకి సమాచారం అందిచారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భార్య కాపురానికి రావడం లేదని చెట్టెక్కాడని తెలుసుకుని భార్యకు నీకు విభేదాలు తొలగిస్తామని చెప్పడంతో ఆ యువకుడు తాటి చెట్టుపై నుండి దిగి వచ్చాడు.