వైరల్: పిల్లి వలనే అతని భార్యకు గర్భం వచ్చిందట... ఎలానో తెలుసా? 

వైరల్: పిల్లి వలనే అతని భార్యకు గర్భం వచ్చిందట... ఎలానో తెలుసా? 

కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి.  మనం ఒకటి అనుకుంటే  విధి మరొకటి తెలుస్తుంది.  ప్రపంచంలో జనాభా ఇప్పటికే 800  కోట్లు దాటిపోయింది.  జనాభా పెరిగిపోతుండటం వలన చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు.  ఇంకొందరు ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అనుకున్నాడు.  తన భార్య కూడా అందుకు అంగీకరించింది.  

అయితే, ఇద్దరు కలిసే సమయంలో గర్భం ధరించకుండా ఉండేందుకు  కండోమ్  వాడుతున్నారట. అయినా సరే అతని భార్య గర్భం ధరించింది.  దీంతో షాకైన ఆ వ్యక్తి, భార్య గర్భం ధరించడానికి కారణాలు వెతకడం ప్రారంభించాడు.  తన భార్య గర్భం ధరించడానికి కారణం తాము పెంచుకుంటున్న పిల్లి అని తెలిసి షాక్ అయ్యాడు.  పెంపుడు పిల్లి రోజు బాత్ రూమ్ లో ఉన్న డెస్క్ లో పడుకుంటుందట.  అయితే, సదరు వ్యక్తి రోజు కండోమ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి డెస్క్ లో పెట్టాడట.  అయితే, ఆ పిల్లి ఆ ప్యాకెట్స్ ను కోరికేసింది.  అయితే, ఆ వ్యక్తి వాటిని చూసుకోకుండా వాడేశాడు.  తరువాత తెలిసి షాక్ అయ్యాడు.   చూసుకొని ఉపయోగించినట్టైతే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా అని బాధపడుతూ తన కథ మొత్తాన్ని బ్లాగ్ పేజీలో రాసుకొచ్చాడు.  దీంతో ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.