బెడ్ తో సహా ఎగిరిపోయాడు... ఎలానో తెలుసా...!!

బెడ్ తో సహా ఎగిరిపోయాడు... ఎలానో తెలుసా...!!

ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు, హోటల్స్ గురించి తెలుసు, కానీ, ఆకాశంలో ఎగిరే బెడ్ రూమ్ గురించి తెలుసా అంటే తెలియదని చెప్తాం.  ఆకాశంలో బెడ్ రూమ్ ఎగరడం ఏంటి అని షాక్ అవ్వకండి..టర్కీకి చెందిన హాసన్ కావల్ అనే వ్యక్తి తన బెడ్ తో సహా ఆకాశంలోకి ఎగిరిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు.  ఆకాశంలో ఎగిరిపోవడం ఏంటని షాక్ అవ్వకండి.  హాసన్ కు సాహసాలు చేయడం అంటే ఆసక్తి ఎక్కువ.  ఆ ఆసక్తితో ఓ ఫీట్ చేయాలని అనుకున్నాడు.  వెంటనే బెడ్, నైట్ లాంప్, టీవీ తో కూడిన బెడ్ ను పారా గ్లైడర్ కు తగిలించాడు.  ఆ తరువాత ఆకాశంలోకి ఎగిరిపోయాడు.  పారాగ్లైడర్ ఆకాశంలో ఎగిరే సమయంలో హాయిగా బెడ్ పై రెస్ట్ తీసుకున్నాడు.  బెడ్ తో సహా ఆకాశంలోకి ఎగిరి ఆ తంతంగాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.