ఢిల్లీలో దారుణం: పాల క్యాన్ లో మద్యం సీసాలు... ఎలా దొరికిపోయాడంటే... 

ఢిల్లీలో దారుణం: పాల క్యాన్ లో మద్యం సీసాలు... ఎలా దొరికిపోయాడంటే... 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  దేశరాజధాని ఢిల్లీ నగరంలో 500 లకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఇందులో తబ్లీగి జమాత్ కు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  దీంతో నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యవసర వస్తువులు మినహా వేటిని అనుమతించడం లేదు.  

అయితే, కొంతమంది నిత్యవసర వస్తువుల ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు.  అడ్డంగా దొరికిపోతున్నారు.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు సమీపంలో పోలీసులు అనేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.  నిత్యవరస వస్తువులను సరఫరా చేసే వెహికల్స్ తప్పించి వేటిని అనుమతించడం లేదు.  దీంతో అయితే, ఓ వ్యక్తి పాల క్యాన్ లో మద్యం బాటిల్స్ పెట్టుకొని వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.  తనిఖీ చేసే సమయంలో అతని ప్రవర్తన ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. 

చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులకు టీ తాగాలని అనిపించింది.  అదే సమయంలో అటుగా పాల క్యాన్ తో వస్తున్న బైక్ ను ఆపారు.  కానీ, అతను బైక్ ఆపకుండా ముందుకు వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.  పాల క్యాన్ ఓపెన్ చేసి చూస్తే అందులో మద్యం బాటిళ్లు ఉన్నాయి.  దీంతో పోలీసులు షాక్ అయ్యారు. లాక్ డౌన్ ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.