గంగూలీపై మమతా ఫైర్... ఎందుకంటే... 

గంగూలీపై మమతా ఫైర్... ఎందుకంటే... 

ఇండియా... సౌత్ ఆఫ్రికా జట్లమధ్య మూడు వన్డే సిరీస్ మ్యాచ్ జరగాల్సి ఉండగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోగా, రెండో మ్యాచ్ కు కరోనా ఎఫెక్ట్ పడింది. ఇక ఇండియా టూరిస్ట్ వీసాలను రద్దు చేయడంతో పాటుగా దేశంలో హైఅలర్ట్ ప్రకటించడంతో బిసిసిఐ వన్డే సీరీస్ ను రద్దు చేసింది.  దీంతో సౌత్ ఆఫ్రికా ఢిల్లీలో అందుబాటులో ఉన్న విమానం పట్టుకొని సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిపోయింది.  

అయితే, మూడో వన్డే మ్యాచ్ ఈనెల 18 వ తేదీన కోల్ కతాలో జరగాల్సి ఉన్నది.  సీరీస్ ను రద్దు చేస్తే ఆ విషయం మ్యాచ్ జరిగే స్టేడియం అధికారులకు, బెంగాల్ క్రికెట్ బోర్డు అధికారులకు, లేదంటే ప్రభుత్వ అధికారులకు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది.  కానీ, గంగూలీ అలా చేయకుండా సీరీస్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.  ఒక్కమాట కూడా చెప్పకుండా సీరీస్ ను రద్దు చేయడం మంచిది కాదని సున్నితంగా మందలించారు.  బెంగాల్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒకసారి సంప్రదిస్తే బాగుందని ఆమె పేర్కొన్నది.