మోడీతో మమతా ఢీ.. 50 మంది ఎమ్మెల్యేలతో ప్లాన్‌

మోడీతో మమతా ఢీ.. 50 మంది ఎమ్మెల్యేలతో ప్లాన్‌

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి మధ్య గత కొంత కాలంగా కల్డ్‌ వార్‌ సాగుతోంది...అది కాస్త  కరోనా కాలంలో మరింత ముదిరింది.. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య, లాక్ డౌన్ నిబంధనల సడలింపు  విషయంలో ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు మాటల యుద్ధానికి దిగగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది...కరోనా కట్టడిపై దీదీపై కేంద్రం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు దీదీ సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై కేంద్రం ప్రభుత్వం చేస్తున్నఆరోణలపై టీఎంసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...

కరోనా నియంత్రణ చర్యలలో ఆలస్యం, దేశ ఆర్ఠిక పరిస్థితిపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యూహాత్మక దాడి చేయాలని ప్లాన్ చేస్తుందని టిఎంసి క్యాంప్‌లో చర్చసాగుంది.... దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారని టీఎంసీ వర్గాలు చెపుతున్నాయి..