‘మేజర్‌’ తాజ్‌హోటల్‌ సెట్ కు చాలా కష్టపడిందట!

‘మేజర్‌’ తాజ్‌హోటల్‌ సెట్ కు చాలా కష్టపడిందట!

అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి' ‘ఎవరు’ వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా వినూత్నమైన సినిమాలను తీస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై నగరంలో తాజ్‌ హోటల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్‌ హోటల్‌లోనే  చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్‌ చేశారట. కానీ ఆ హోటల్ నుంచి అనుమతి రాకపోవడంతో ఏకంగా ఆ హోటల్‌ సెట్‌నే వేశారు. అయితే ‘ప్రతి సెట్‌ వేసే క్రమంలో మేజర్ టీమ్ ఎంతో క్షుణంగా పరిశీలించిందట. ముఖ్యంగా తాజ్‌ ప్యాలెస్‌ సెట్‌ వేయడానికి చాలా కష్టపడ్డారని దర్శకుడు తెలిపాడు. అడవి శేష్‌ స్టోరీని నేరేట్‌ చేసేటప్పుడు తాజ్‌ హోటల్‌ ప్రాధాన్యాన్ని వివరించినట్లుగా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హోటల్ లో చిత్రీకరణ జరగనుంది.