టాప్ ప్లేసుకి ప్లాన్ చేసిన ప్రొడక్షన్ కంపెనీ..

టాప్ ప్లేసుకి ప్లాన్ చేసిన ప్రొడక్షన్ కంపెనీ..

తెలుగు చిత్ర సీమలోని అగ్ర ప్రొడక్షన్ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. అద్భుత సినిమాలను తెరకెక్కించేందుకు ఎప్పుడు తాపత్రయ పడుతుంటుంది. పరిశ్రమకు ఎందరో హీరోలను, హీరోయిన్‌లను, దర్శకులను, గొప్పగొప్ప నటీనటులను పరిచయం చేశారు. మొదట తెలుగు చిత్రాలను విదేశాలలో విడుదల చేశారు. ఇప్పుడు వీరు పెద్ద సినిమా, చిన్న సినిమా బేధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ బ్యానర్‌లో దాదాపు 10సినిమాలు రూపొందనున్నాయి. వీటిలో కొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ప్రముఖంగా అల్లు అర్జున్ పుష్పా కూడా ఈ ప్రొడక్షన్‌లోనిదే. ఇంకా ఉప్పెన, అంటే సుందరానికి వంటి ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. వీటిలో ఉప్పెన సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా చిత్రీకరణలో ఉన్నవాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శంకర్ కాంబో, బాలయ్య, బోయపాటి కాంబో, కొరటాల శివ-రాంచరణ్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, చిరంజీవి-బాబీ వంటి ఎన్నో కాంబోలు తెరకెక్కుతున్నాయి. ఈ కాంబోలను చూస్తేనే వీరి పెట్టుబడుల రేంజ్ ఎంతో అర్థం అవుతోంది. ఇదే తరహాలో కొనసాగితే అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్ మారుతుంది.