'మెయిల్' మూవీ టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ

'మెయిల్' మూవీ టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ

కమెడియన్ ప్రియదర్శి 'మ‌ల్లేశం' సినిమాలో హీరోగా న‌టించి ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. త‌న‌దైన శైలిలో కామెడీ ట‌చ్‌తో అంద‌రినీ అల‌రించే ప్రియ‌ద‌ర్శి 'కంబాలప‌ల్లి క‌థ‌లు' పేరుతో 'మెయిల్' వెబ్ సిరీస్ తో సంక్రాంతికి వచ్చాడు. జనవరి 12 న తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’‌లో విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్లతో మంచి స్పందన రాబట్టుకుంది. సంక్రాంతి పెద్ద సినిమాలతో పోటీగా 'మెయిల్' సినిమా ఓటీటీలో మంచి ఆదరణను రాబట్టుకుంది. 'ప్రియదర్శి, రవి కోసం ఒక జీ మెయిల్ క్రియేట్ చేస్తాడు. అయితే అకౌంట్‏కు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రావడం వలన ఏం జరిగింది'..? అనేది కథ. ప్రియదర్శితో పాటు హర్శిత్ మల్గిరెడ్డి, గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గురించి తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే.