అర్ధశతకాలతో సెంచరీ భాగసౌమ్యం నెలకొల్పిన శార్దుల్, సుందర్....

అర్ధశతకాలతో సెంచరీ భాగసౌమ్యం నెలకొల్పిన శార్దుల్, సుందర్....

కష్టాలో ఉన్న భారత జట్టును ఆదుకుంటున్నారు భారత యువ బౌలర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ మొదటి అంతర్జాతీయ అర్ధశతకాలను పూర్తి చేసుకొని సెంచరీ భాగసౌమ్యం నెలకొల్పారు.186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును వీరి బ్యాటింగ్ తో  292/6 తో నిలిపారు. అయితే గబ్బా వేదికగా భారత్ తరపున 7 వ వికెట్ కు అత్యధిక భాగసౌమ్యం నెలకొల్పిన జంటగా వీరు రికార్డు సృష్టించారు. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 26 ఓవర్లు మిగిలి ఉండగా భారత జట్టు ఆసీస్ కంటే ఇంకా 72 పరుగులు వెనుకబడి ఉంది. చూడాలి మరి వీరు ఇలానే ఆడితే ఈరోజు భారత్ ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం ఉంది.