మహేష్.. పూరిల సినిమా రానుందా .?

మహేష్.. పూరిల సినిమా రానుందా .?

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరీజగన్నాద్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఈ సినిమా తిరగరాసింది. ఆతర్వాత ఈ ఇద్దరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకూడా సూపర్ హిట్ అయింది. దాంతో  పూరినుంచి హ్యాట్రిక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ . వీరిద్దరి కాంబోలో జనగనమణ అనే సినిమా రాబోతుంది అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.పూరి కాస్త వెనకబడటం . మహేష్ బాబు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇప్పటి వరకు చర్చల దశకు చేరుకోలేదు. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు త్వరలో పూరి గారు చెప్పే కథ వినబోతున్నట్లుగా చెప్పాడు. పూరి కూడా జనగనమణ ఆమద్య మరో హీరోతో చేయాలని భావించినా కూడా మళ్లీ మహేష్ నుండి సిగ్నల్స్ వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జనగనమణ సినిమా కాస్త ఆలస్యంగా అయినా వీరిద్దరి కాంబోలో పట్టాలెక్కడం మాత్రం కన్ఫర్మ్ అని అభిమానులు అనుకుంటున్నారు.అన్ని కుదిరితే 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్