రాజమౌళి సినిమా వరకు ఆగలేనంటున్న మహేష్...

రాజమౌళి సినిమా వరకు ఆగలేనంటున్న మహేష్...

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే మహేష్ సినిమాలు ఇక్కడ సూపర్  హిట్ అవుతున్న మహేష్ ఇంకా పాన్ ఇండియా సినిమా చేయకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. మహేష్ తర్వాత వచ్చిన  ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడం ఖాయం. కానీ ఇప్పుడు అందరూ హీరోలు పాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో రాజమౌళి సినిమా వరకు ఆగకుండా మహేష్ సర్కారు వారి పాట సినిమానే పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. ఇది నిజం అయితే మహేష్ అభిమానులు పండుగ చేసుకోవడం తప్పనిసరి.