కరోనా బాధితులకు మహేష్ బాబు భారీ విరాళం...

కరోనా బాధితులకు మహేష్ బాబు భారీ విరాళం...

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం వణికిపోతుంది. ఈ వైరస్ కు ఇంకా మందు కనిపెట్టకపోవడం తో కరోనా కారణంగా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తెలంగాణలో కూడా ఈ వైరస్ వీర విహారం చేస్తుంది. మన రాష్ట్రం లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 36 నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటం తో భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బాధితుల సహాయం కొరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక లెటర్ ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ఇంకా అందులో... ప్రజలు అందరూ ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలని అలాగే 21 రోజుల సామజిక దూరం పాటించాలని తెలిపారు. అలాగే అందరూ లాక్ డౌన్ రూల్స్ కూడా పాటించాలని వెల్లడించారు. ఈ సమయం లో మనకు మనమే రక్షణగా ఉండాలని అన్నారు. అయితే ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు అని వాయిదా పడిన విషయం తెలిసిందే.