లక్షల విలువ చేసే కరోనా వెంటీలేటర్... కేవలం రూ.7500కే... భళా ఇండియా...

లక్షల విలువ చేసే కరోనా వెంటీలేటర్... కేవలం రూ.7500కే... భళా ఇండియా...

కరోనా వరైస్ పై ఇండియా పోరాటం చేస్తున్నది.  అభివృద్ది చెందిన దేశాలు ప్రస్తుతం అన్నింటినీ పక్కన పెట్టి కరోనా వైరస్ పై యుద్దం చేస్తున్నాయి.  ఈ యుద్దంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది పక్కన పెడితే, యుద్దం నుంచి బయటపడే సరికి చాలా నష్టపోవలసి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ముందుగా టెస్టింగ్ కిట్స్ కావాలి.  అన్నీ దేశాలు ప్రస్తుతం వీటిని సమకూర్చుకునే స్థితిలో ఉన్నాయి.  అందరూ దీనిపైనే దృష్టిపెట్టారు.  దీంతో పాటుగా పరిస్థితి చేయిదాటిపోయినపుడు వెంటీలేటర్లపై వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తుంది.  ఆ సమయంలో తప్పనిసరిగా వెంటీలేటర్లు కావాలి.  వెంటీలేటర్లు సమకూర్చడం అంటే మామూలు విషయం కాదు.  ఒక్కొక్కటి బయట  మార్కెట్లో లక్షల రూపాయల విలువ ఉంటుంది.  

అయితే, దేశం ప్రమాద స్థితిలో ఉన్నది.  ఇప్పుడు దేశాన్ని అదుకోవాలసిన బాధ్యత అందరిపై ఉన్నది.  ఇందులో భాగంగానే మహేంద్ర కొంపని ఇప్పటికే కరోనాపై పొరటం చేసేందుకు కావాల్సిన గ్లాస్ హెల్మెట్లను తయారు చేస్తున్నది.  రేపటి నుంచి వీటిని తయారు చేయబోతున్నారు.  దీంతో పాటుగా అంబు బ్యాగ్ పేరుతో వెంటీలేటర్లు తయారు చేస్తున్నారు.  అన్నీ హంగులతో అధూతనంగా ఈ వెంటీలేటర్లు ఉంటాయని అంటున్నారు.  మామూలుగా ఇలాంటి వెంటీలేటర్లు మార్కెట్లో ఐదు నుంచి పది లక్షల వరకు ఉంటుంది. కానీ, మహేంద్ర కంపనీ కేవలం రూ.7500 కి వెంటీలేటర్లు అందిస్తున్నట్టు మహేంద్ర కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.