ఆన్లైన్ క్లాసుల కష్టాలు: సిగ్నల్స్ కోసం చెట్టెక్కిన మాస్టారు...
కరోనా కారణంగా స్కూల్స్ బంద్ అయ్యాయి. విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో విద్యార్థుల కోసం స్కూల్స్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలి అంటే తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండాలి. నగరాల్లో ఉండే ప్రజలకు స్మార్ట్ ఫోన్, సిగ్నల్ అందుబాటులో ఉంటాయి. అయితే, గ్రామాల్లో అందులోనూ మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికీ ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉంటుందా అంటే ఉండదని చెప్పాలి. దీంతో అక్కడి విద్యార్థులు, అక్కడ ఉండే ఉపాధ్యాయులు ఆన్లైన్ లో క్లాసులు చెప్పేందుకు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా దద్గావ్ గ్రామంలో స్కూల్ మాస్టర్ ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు నానా తంటాలు పడుతున్నాడు. గ్రామంలో సమీపంలో ఉన్న కొండకు ఎక్కి అక్కడ ఉన్న చెట్టుపై కూర్చుకుంటున్నారు. అక్కడే బోర్డు ఏర్పాటు చేసి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాడు. తనతో పాటుగా ఆ గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులను కూడా తీసుకొని చెట్టుపై సామజిక దూరం పాటిస్తూ కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)