సెల్ఫీ కోసం హద్దు దాటిన సీఎం సతీమణి

సెల్ఫీ కోసం హద్దు దాటిన సీఎం సతీమణి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సెల్ఫీ కోసం సెక్యూరిటీ లిమిట్స్ దాటి ముందుకు వెళ్లింది. దేశంలోని తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ ఆంగ్రియా ప్రారంభం సందర్భంగా ఆమె  రెయిలింగ్ దాటి వెళ్లింది. నౌక అంచున కూర్చోని సముద్ర అందాలను సెల్ ఫోన్ లో బంధించే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన అక్కడి సెక్కూరిటీ అధికారులు ఆమెను వారించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా సెల్పీలు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఓ సెలబ్రిటి భార్య అయి ఉండి ఇలా ప్రమాదపు అంచుల్లో సెల్పీలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.