రెండో రోజు మహానాడుకు రంగం సిద్దం...ఇదే షెడ్యూల్

రెండో రోజు మహానాడుకు రంగం సిద్దం...ఇదే షెడ్యూల్


 టీడీపీ మహానాడు ఇవాళ రెండో రోజు కొనసాగనుంది. కరోనా ఎఫెక్ట్‌తో మొదటి రోజు  జూమ్ యాప్‌ ద్వారా మహానాడును నిర్వహించారు. ఆన్‌లైన్లోనే తీర్మానాలు పెట్టి.. ఆమోదించారు. తొలి రోజు మహానాడులో ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టారు. పార్టీ కార్యాలయం నుంచి కేవలం చంద్రబాబు సహా ఐదారుగురు సీనియర్లు మహానాడులో పాల్గొంటే ఆన్‌లైన్లో సుమారు 14 వేల మంది పాల్గొన్నారు. టీడీపీ మహానాడులో రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తారు నేతలు. అనంతరం పార్టీ సంస్థాగత తీర్మానం చేయనుంది పార్టీ. అనంతరం ఏపీలో భూ ఆక్రమణలు, జే-ట్యాక్స్‌, ప్రభుత్వ అవినీతిపై తీర్మానం చేస్తారు. 

అలాగే, రాష్ట్రంలో ధరల పెంపు, ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల భారంపై తీర్మానం చేయనున్నారు. ప్రజారాజధాని అమరావతి, రాష్ట్రాభివృద్ధి గాడి తప్పిందన్న అంశాలపై తీర్మానాలు చేయనుంది టీడీపీ. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతారుల నేతలు. తెలంగాణ విద్య, వైద్య రంగాలపై తీర్మానం చేస్తారు. అనంతరం బడుగుల సంక్షేమానికి చెందిన 34 పథకాల రద్దుపై మరో తీర్మానం జరుగుతుంది. టీఆర్‌ఎస్‌ వాగ్దానాలు, వైఫల్యాలుతో పాటు ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నంపై తీర్మానాలు చేస్తారు. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేస్తారు.

మహానాడు రెండవ రోజు షెడ్యూల్ 

ఉదయం 11 గం.: ఎన్టీఆర్‌కు టీడీపీ నేతల నివాళి 
ఉదయం 11:25 గం.: పార్టీ సంస్థాగత తీర్మానం     
ఉదయం 11:40 గం.: భూ ఆక్రమణలు, జే-ట్యాక్స్‌, ప్రభుత్వ అవినీతిపై తీర్మానం 
మధ్యాహ్నం 12 గం.: ధరల పెంపు, ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల భారంపై తీర్మానం 
మధ్యాహ్నం 12:15 గం.: ప్రజా రాజధాని అమరావతి, రాష్ట్రాభివృద్ధి గాడి తప్పిందన్న అంశాలపై తీర్మానాలు 
మధ్యాహ్నం 12:35 గం.: భోజన విరామం 
సాయంత్రం 4 గం.: తెలంగాణ విద్య, వైద్య రంగాలపై తీర్మానం 
సాయంత్రం 4:10 గం.: బలిపీఠంపై బడుగుల సంక్షేమం, 34 పథకాల రద్దుపై తీర్మానం 
సాయంత్రం 4:25 గం.: టీఆర్‌ఎస్‌ వాగ్దానాలు, వైఫల్యాలపై తీర్మానం
సాయంత్రం 4:30 గం.: ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నంపై తీర్మానం
సాయంత్రం 4:50 గం.: రాజకీయ తీర్మానం
సాయంత్రం 5:05 గం.:  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం