23 ఏళ్లకే జడ్పీ ఛైర్‌పర్సన్..

23 ఏళ్లకే జడ్పీ ఛైర్‌పర్సన్..

చదువుకున్నది ఇంజినీరింగ్.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి.. ఏకంగా జడ్పీ పీఠాన్ని అధిరోహించింది 23 ఏళ్ల ఆంగోతు బిందు. జెడ్పీటీసీ ఎన్నికల్లో బయ్యారం నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆంగోతు బిందు.. శనివారం జరిగిన జడ్పీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించినట్లుగానే జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని తన ఖాతాలో వేసుకుంది. అయితే, తన చిన్నమ్మ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు ఆంగోతు బిందు. 23 ఏళ్లకే జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై అతి చిన్న వయసులోనే జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఆమె.. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని చెప్పారు.