స్టేజ్ మీదే మంత్రికి హెయిర్ కట్ చేసిన బార్బర్‌.. బహుమతిగా రూ. 60 వేలు!

స్టేజ్ మీదే మంత్రికి హెయిర్ కట్ చేసిన బార్బర్‌.. బహుమతిగా రూ. 60 వేలు!

కరోనా భయంతో చాలా మంది  సెలూన్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎందుకైనా మంచిదని ఇంట్లోనే సొంతంగా కటింగ్ చేసుకుంటున్నారు. కానీ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మాత్రం వినూత్నంగా చేశారు. ఏకంగా ఓ కార్యక్రమంలో స్టేజీపైనే కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా అతని ప్రతిభకు మెచ్చి రూ. 60 వేలు సాయం చేశాడు. ఆ డబ్బుతో షాప్ పెట్టుకోవాలని సూచించాడు.  ఖండ్వా జిల్లా గులైమాల్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన రోహిదాస్ అనే వ్యక్తి తాను సెలూన్ పెట్టుకోవడానికి సాయం చేయాలని మంత్రిని కోరాడు. వెంటనే అతని ప్రతిభను పరీక్షించుకోవాలని అనుకొని స్టేజీపైకి పిలిచారు. తనకు కటింగ్, షేవింగ్ చేయమని కోరాడు. వెంటనే రోహిదాస్ చేతులకు శానిటైజర్‌ రాసుకొని, ఫేస్‌మాస్క్ ధరించి జాగ్రత్తగా పని పూర్తి చేశాడు. కాగా కరోనా కారణంగా చాలా మంది సెలూన్‌కు రావడం లేదని అందుకే వారిలో భరోసా కల్పించేందుకు తాను అందరి ముందే కటింగ్ చేయించుకున్నానని మంత్రి చెప్పారు.