మచిలీపట్నంలో కలకలం రేపుతోన్న మర్డర్ అటెంప్ట్

మచిలీపట్నంలో కలకలం రేపుతోన్న మర్డర్ అటెంప్ట్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మార్కెట్  యార్డ్ చైర్మన్ కొడుకు ఖాదర్‌ పై అతని భార్యే పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాల పాలైన బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. ఖాదర్‌ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతను నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లిపై నదియా, ఖాదర్ మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యే ఖాదర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిందని భావిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఖాదర్ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోనే ఘటన జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ కలహాలా..? రాజకీయ కారణాలా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కుటుంబ సభ్యులు ప్రమేయం మీద దర్యాప్తు చేస్తున్నారు.