వరుడి ముందే వధువుకు ముద్దు..ప్రియుడే కావాలన్న వధువు..!

వరుడి ముందే వధువుకు ముద్దు..ప్రియుడే కావాలన్న వధువు..!

కరీంనగర్ జిల్లాల్లో పెళ్ళైన కొన్ని గంటలకే ఓ జంట విడిపోయింది. దీనికి కారణం పెళ్ళైన అనంతరం పెళ్లి ఊరేగింపు చేస్తుండగా వరుడి ముందే వధువుకు ఆమె ప్రియుడు వచ్చి ముద్దు పెట్టాడు. దాంతో సినిమాను తలపించేలా ఆ తరవాత కథ కొనసాగింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ కు చెందిన దివ్య అనే యువతి వంశీ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ క్రమంలో కుటుంబం మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్‌కుమార్ తో ఆమెకు పెళ్లి కుదిర్చింది. కుటుంబం కోసమో లేదంటే సమాజం కోసమో తెలీదుగానీ దివ్య పెళ్ళికి ఓకే చెప్పింది. దాంతో ప్రవీణ్‌కుమార్ తో బంధువుల సమక్షంలో సోమవారం రాత్రి పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి తరవాత బరాత్‌ నిర్వహిస్తుండగా దివ్య ప్రియుడు వచ్చి వరుడి ముందే ఆమెకు ముద్దు పెట్టాడు. దాంతో వరుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. దాంతో ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. కాగా ప్రియుడు పోలీసుల అదుపులో ఉండటంతో దివ్య వెళ్లి తనకు ప్రియుడే కావాలని అతడితోనే ఉంటానని వేడుకుంది. దాంతో కంగు తిన్న వరుడు చేసేదిలేక ఆమెను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు.