ప్రియుడికి నయన్ దూరం..!

ప్రియుడికి నయన్ దూరం..!

ప్రస్తుతం పలు తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న దక్షిణాది కథానాయిక నయనతార. ప్రస్తుతం లేడి సూపర్ స్టార్ నయన్ ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరి మకాం అక్కడే. కానీ, ఇద్దరికి వేర్వేరు రూములు ఇచ్చారట. చెన్నైలో ఎక్కువగా కలిసి ఉండే ఈ జంట. రామోజీ ఫిలిం సిటీలో వేర్వేరు గదులు కేటాయించడానికి ఒక రీజన్ ఉంది.

నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న “అన్నత్తే” సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో నటిస్తున్న వారెవ్వరూ కూడా సినిమా యూనిట్ కి సంబంధం లేని వారితో కలవకూడదు. ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాడు. ఆయన విజయ్ సేతుపతి, సమంత జంటగా ఒక తమిళ్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. ఐతే, రజినీకాంత్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు, ఆ సినిమా టీం, ఈ సినిమా టీం కలవకూడదట. దాంతో నయనతార తన బాయ్ ఫ్రెండ్ ని కలవలేని పరిస్థితి.