లవ్ స్టోరీ రిలీజ్ ఫిక్స్..

లవ్ స్టోరీ రిలీజ్ ఫిక్స్..

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులను మరింతగా ఊరించింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఓవర్‌సీస్ హక్కులను ఆరున్నర కోట్లకు విక్రయించారు. దాంతో అక్కడ కూడా మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకునేంతవరకు సినిమా విడుదల కాదని భావించారు.  అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న నాగశౌర్య సినిమా కూడా ఏప్రిల్‌లోనే విడుదల అయ్యేందుకు సిద్దమవుతోంది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాతో పాటు నాచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ కూడా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటి చేశారు. అయితే చివరకు నానీ సినిమా వెనక్కు తగ్గింది. అయితే టక్ జగదీష్ రిలీజ్ డేట్ ఫిక్స్ కవాల్సి ఉంది.