పరువు హత్య భయం : కాకినాడలో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట !

పరువు హత్య భయం : కాకినాడలో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట !

పరువు హత్యల నేపధ్యంలో భయాందోళనలో ఉన్న ఓ ప్రేమ జంట పోలీసుల్ని ఆశ్రయించింది. కాకినాడలో జిల్లా ఎస్పీని కలిసిన ప్రేమ జంట.. తమకు ప్రాణహని ఉందని  ఫిర్యాదు చేసింది. తనకు, తన  భర్తకు  తన తల్లిదండ్రులు నుండి  ప్రాణహాని ఉందని ఎస్పీకి బాధితురాలు కంప్లైంట్ చేసింది. విజయవాడకు చెందిన దీపిక ఏడాది కింద వరప్రసాద్ ను ప్రేమించింది. ఏడాది క్రితం రైలులో పరిచయం  అయిన  రామచంద్రాపురంకు చెందిన బలిపాటి వరప్రసాద్ ని విజయవాడకు చెందిన జంగాల ఈష దీపిక ప్రేమించింది. కొద్ది రోజుల క్రితం ట్రావెల్స్ లో పని చేసే వరప్రసాద్ ను ప్రేమ వివాహం చేసుకుంది దీపిక. దీంతో ప్రేమ జంటను రామచంద్రపురం పోలీసులకు అప్పగించారు జిల్లా పోలీసులు. ఇప్పటికే దీపిక కనిపించడంలేదని కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు  ఫిర్యాదు చేశారు.