విశాఖ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

విశాఖ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖలోని మల్కాపురం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ టెర్మినల్ లారీ పార్కింగ్ యార్డ్ సమీపంలో ఒక లారీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ సిబ్బంది మంటలు అర్పివేశారు. బ్లాక్ ఆయిల్ టెర్మినల్ నుండి వేదాంతపూర్ కు లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ లో ఈ మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు, హెచ్ పి సి ఎల్ అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు చేపట్టారు.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం మొదలు జరుగతున్న వరుస ప్రమాదాలు వైజాగ్ వాసులని టెన్షన్ పెడుతున్నాయి. నిజానికి విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ టెర్మినల్‌ ను అధికారులు తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ప్రమాణాలపై ఆరా తీసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే కట్టడి చేసేందుకు చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను అడిగి తెలుసుకున్నారు.