అంతర్వేదిలో రథం దగ్ధం..స్పందించిన లోకేశ్..!

అంతర్వేదిలో రథం దగ్ధం..స్పందించిన లోకేశ్..!

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో  ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం కాలిపోవడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరుస ట్వీట్లతో స్పందించారు. 60 ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఉపయోగిస్తున్న రథం కాలిపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని అన్నారు. దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైసీపీ పాలనలో లక్ష్మీనరసింహుడి రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని పండితులు అంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు. ఓ వైపు గోశాల‌ల్లో గోవుల‌ మృత్యుఘోష‌, మ‌రోవైపు రోజుకొక ఆల‌యంలో అరిష్ట సంకేతాలు వెలువ‌డుతున్నాయన్నారు. ర‌థం ద‌గ్ధం కావ‌డానికి కార‌కులెవ‌రో గుర్తించి క‌ఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.